ఢిల్లీకి రండి.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే పిలుపు!

  • ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం 
  • సాయంత్రం 4 గంటలకు మహరాష్ట్ర నేతలతో భేటీ
  • మహారాష్ట్రలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, అనుసరించాల్సిన వైఖరిపై తమ తమ పార్టీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ ముగిసిన అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రమ్మని పిలిచామని ఆయన వివరించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వారితో చర్చించి, మహారాష్ట్రలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తామని తెలిపారు.

కాగా, మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చే విషయంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీతో కలవకూడదని కొందరు నేతలు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. కాగా, రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. ఈ రోజు రాత్రి 7.30 లోపు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని శివసేనకు డెడ్‌లైన్ విధించారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ తమ పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నాయి.
Go Back to Shorts
Congress
ncp
shiv sena
Maharashtra

More Telugu News